
73 రోజుల తరువాత చేరిన మృతదేహం
చిన్నశంకరంపేట: సౌదీ అరేబియాలో మృతి చెందిన మెదక్ జిల్లావాసి మృతదేహం 73 రోజుల తరువాత సోమవారం సొంతూరుకు చేరుకుంది. చిన్నశంకరంపేట మండలం కామారం తండాకు చెందిన కేతావత్ రవి(28) బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లి మృతి చెందిన విషయం విదితమే.
గత డిసెంబర్ 31న సౌదీలోని రియాద్ సమీపంలో కలిబులిలో రోడ్డు పక్కన ఇసుకను లోడ్‌చేసే పనిలో నిమగ్నమైన రవిని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 73 రోజుల తరువాత రవి శవం కళ్లజూసిన అతడి కుటుంబీకులు తల్లడిల్లిపోయారు.