స్వగ్రామం చేరిన గల్ఫ్‌ మృతదేహం | Dead body reached from Gulf to homeland | Sakshi
Sakshi News home page

స్వగ్రామం చేరిన గల్ఫ్‌ మృతదేహం

Published Sat, May 6 2017 11:23 PM | Last Updated on Mon, Aug 20 2018 7:33 PM

స్వగ్రామం చేరిన గల్ఫ్‌ మృతదేహం - Sakshi

స్వగ్రామం చేరిన గల్ఫ్‌ మృతదేహం

►48 రోజులకు ఇంటికి
►  శోకసంద్రంలో  కుటుంబ సభ్యులు

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఉన్నఊరిలో ఉపాధి కరువై బతుకు దెరువు కోసం పరాయి దేశం వెళ్లి కానరాని లోకాలకు వెళ్లా డో అభాగ్యుడు. ఇల్లంతకుంటకు చెందిన కూనబోయిన సంపత్‌ గతేడాది సౌదీ వెళ్లాడు. వెళ్లిన పదినెలలకే అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు సంపత్‌ 48 రోజుల క్రితం మృతిచెందగా శుక్రవారం సాయంత్రం మృ తదేహం ఇల్లంతకుంటకు చేరింది.

సంపత్‌ మృతదేహం ఇంటికి చేరగానే కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటా యి.  పొట్టకూటి కోసం వెళ్లిన కొడుకు కాటికి చేరువయ్యాడని తల్లి లచ్చవ్వ కన్నీరుమున్నీరవ్వడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. తన భర్త రాజయ్య, పెద్దకొడు కు బాలరాజులు గతేడాది క్రితం మృతిచెందారని, ఇప్పు డు చిన్నకొడుకు కూడా మరణించడంతో తనకింక దిక్కెవరంటూ లచ్చవ్వ రోధించడం కలచివేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement