వైఎస్సార్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది.
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె వద్ద బైక్పై వెళ్తున్న వారిని ఓ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన డి.రోజా(34) తన అక్క కుమారుడితో కలసి బైక్‌పై వెళ్తుండగా స్థానిక మార్కెట్ యార్డు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో రోజా అక్కడికక్కడే చనిపోగా ఆమె బంధువు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.