అనకాపల్లి: విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జెఎంజె స్కూల్ వద్ద బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది. ముందు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న సరగడం లక్ష్మి(48) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఆటో నడుపుతున్న ఆమె భర్త స్వల్పంగా గాయపడ్డాడు. మృతురాలిది పెదపాడుపేట గ్రామం. దంపతులిద్దరూ స్వంత ఆటోలో ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.