పెరవలి: తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల వద్ద బుధవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మణి అనే మహిళ మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన వీరు తణుకులోని బాలబాలాజీ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నట్టు సమాచారం. అయితే స్పిన్నింగ్ మిల్లుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.