auto-lorry collisioned
-
మేడారం జాతరకు వెళ్తుండగా..
సాక్షి, తాడ్వాయి: జయశంకర్ జిల్లా తాడ్వాయి సమీపంలో విషాదం చోటుచేసుకుంది. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళుతున్న తండ్రీకొడుకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చెవిటిగూడెంకు చెందిన ఆటో డ్రైవర్ పి.అంజయ్య(50) తన కుమారుడు నవీన్(23)తో కలిసి ఆటోలో జాతరకు వెళ్తున్నాడు. తాడ్వాయి-పస్రా మధ్యలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాడ్వాయి ఎస్సై కరుణాకర్‌రావు తెలిపారు. -
ఆటోను ఢీకొన్న లారీ.. మహిళ మృతి
పెరవలి: తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల వద్ద బుధవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మణి అనే మహిళ మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన వీరు తణుకులోని బాలబాలాజీ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నట్టు సమాచారం. అయితే స్పిన్నింగ్ మిల్లుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.