అల్లూరి సీతారామరాజు: ప్రకృతి ఒడిలో సరదాగా సేదా తీరుదామని వచ్చిన ఓ పర్యాటకురాలిని చెట్టుకొమ్మ రూపంలో మృత్యువు కబళించింది. ఆమె బంధువుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు విహార యాత్రకు మారేడుమిల్లి బయలుదేరారు. మార్గంలో రాజమహేంద్రవరంలో మరొక మహిళతో కలిసి ఎనిమిది మంది బుధవారం మారేడుమిల్లి వచ్చారు. ఇక్కడ నుంచి జతలరంగిణి జలపాతం వద్దకు వెళ్లారు. సందర్శన అనంతరం అక్కడి నుంచి అమృతధార జలపాతానికి వెళ్లారు.
వీరిలో రాజమహేంద్రవరానికి చెందిన ఎ.సంధ్య (38) జలపాతం పైభాగంలో బండరాళ్లపై కూర్చొని ఉంది. ఆమైపె ఒక్కసారిగా భారీ చెట్టు కొమ్మ విరిగి ఆమైపె పడింది. దీంతో ఆమె కిందకు జారి బండరాళ్లపై పడిపోయింది. తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment