
ఐజీ శ్రీనివాస్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం
ఆరిలోవ: విశాలాక్షినగర్ కేంద్రంగా ఉన్న కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ) ఆరాధ్యుల శ్రీనివాస్ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ పతకం అందుకున్నారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన సీఆర్పీఎఫ్ 86వ వార్షికోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేతుల మీదుగా ఆయన ఈ పతకం స్వీకరించారు. 34 ఏళ్లుగా శ్రీనివాస్ అందిస్తున్న సేవలు, ఆయన నాయకత్వ పటిమ, నిబద్ధత, దేశ భద్రతకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. స్థానికుడైన ఐజీ శ్రీనివాస్‌కు ఈ పురస్కారం లభించడం పట్ల సీఆర్పీఎఫ్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.