180 కిలోల గంజాయి స్వాధీనం
చింతపల్లి: మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 115 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేసినట్టు చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. సబ్‌డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో బుధవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. మండలంలోని అన్నవరం పోలీసులు రోజువారీ తనిఖీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం లోతుగెడ్డ వంతెన వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ సమయంలో వచ్చిన ఒక ఆటోను తనిఖీ చేసి, మూడు బస్తాలతో గంజాయిని తరలిస్తున్నట్టు గురించినట్టు ఏఎస్పీ తెలిపారు. ఈ గంజాయి ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా రోల్లగెడ్డ గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్‌సరిహద్దు బలపం మీదుగా పాడేరు తరలిస్తున్నారన్నారు. బెంగళూరుకి చెందిన వ్యక్తికి అప్పగించడానికి ఒప్పందం కుదుర్చుకుని ఒక ఆటోతో పాటు బైక్‌తో తరలిస్తున్నట్టు తెలిపారు. గంజాయి తరలింపులో కుడుమసారి పంచాయితీ కోటగున్నలు గ్రామానికి చెందిన వారున్నారు. దీని విలువ రూ.5.5 లక్షలు విలువ ఉంటుందని తెలిపారు.గంజాయిని తరలిస్తున్న ఆటో,బైక్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లును సీజ్ చేసినట్టు చెప్పారు. అరెస్టు చేసిన నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. గంజాయిని పట్టుకున్న ఎస్‌ఐ వీరబాబును అభినందించారు.ఈ కార్యక్రమంలో సీఐ వినోద్‌బాబు తదితరులు ఉన్నారు.
పెదబయలు: మండలంలోని సీతగుంట పంచాయతీ సమీపంలోని ఏవోబీ వంతెన వద్ద బుధవారం వాహన తనిఖీలు చేస్తుండగా 65 కిలోల గంజాయి పట్టుకున్నట్టు ఎస్‌ఐ కొల్లి రమణ తెలిపారు. మల్కర్‌గిరి జిల్లా చిత్తరకొండ ప్రాంతం నుంచి రూడకోట మీదుగా ఒడిశా పాడువకు వెళ్తున్న ఆటోను తనిఖీ చేయగా గంజాయి లభ్యమైనట్టు చెప్పారు. గంజాయి తరలిస్తున్న కొరాపుట్టు జిల్లా నందపూర్ బ్లాక్ మర్రిపాలెం గ్రామానికి చెందిన లబో కిడంగ్, అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం బురిడి అర్జున్‌ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 2.50లక్షలు ఉంటుందని తెలిపారు.
180 కిలోల గంజాయి స్వాధీనం


