షికారుకెళ్లి.. ప్రమాదకర షార్క్ చేతిలో..! | Woman killed by shark bigger than a boat in western Australian city of Perth | Sakshi
Sakshi News home page

షికారుకెళ్లి.. ప్రమాదకర షార్క్ చేతిలో..!

Published Sun, Jun 5 2016 5:47 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

షికారుకెళ్లి.. ప్రమాదకర షార్క్ చేతిలో..! - Sakshi

షికారుకెళ్లి.. ప్రమాదకర షార్క్ చేతిలో..!

సిడ్నీ: సరదాగా బోటు షికారుకు వెళ్లిన ఓ ఆస్ట్రేలియా మహిళ ప్రమాదకర షార్క్ కు ఆహారమైంది. ఈ ఘటన ఆదివారం పెర్త్ నగరంలో చోటుచేసుకుంది. షార్క్ కాలు తినేయడంతో ఓ వ్యక్తి మృతిచెందిన రెండు రోజులకు అదే తీరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ప్రమాదకరమైన అతి పెద్ద వైట్ షార్క్ లు పెర్త్ తీరంలో చాలా ఉన్నాయి.

ఇన్ స్పెక్టర్ డానీ ముల్లిగాన్ వివారాల ప్రకారం...బోటులో షికారుకు ఓ మహిళతో పాటు ఆమె పార్ట్నర్ వెళ్లాడు. ఆ బోటు పొడవు 5 మీటర్లు ఉంది. పెర్త్ తీరంలో వీరు నీళ్లలోకి కొంత దూరం వెళ్లాక ఓ షార్క్ వీరిపై దాడి చేసింది. మహిళను షార్క్ నీళ్లలోకి ఈడ్చుకెళ్లింది. అదే సమయంలో అక్కడికి మరో బోటు రావడంతో షార్క్ నుంచి తప్పించుకున్న వ్యక్తి ఆ బోటులోకి ఎక్కాడు. రెండో బోటు లో ఉన్నవాళ్లు ఆ వ్యక్తికి ధైర్యం చెప్పి అసలు విషయాన్ని తెలుసుకున్నారు.

ఇంతలో షార్క్ కు ఆహారమైన మహిళ మృతదేహాన్ని వారు గుర్తించారు. తాము గుర్తించే సమయానికి ఆ మహిళ ప్రాణాలతో లేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రమాదకర షార్క్ తాము షికారుకు వెళ్లిన బోటు కంటే మీటర్ పొడవు ఎక్కువగా ఉందని వివరించాడు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 98 మంది చనిపోయారని ఓ అధికారి వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో అయితే ఇది ఆరో ప్రమాదమని, రెండు రోజుల కిందట ఓ బోటు డ్రైవర్ ను షార్క్ బలిగొందని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement