
సాక్షి, ఆదిలాబాద్ : ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలివి.. బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తి రోడ్డు క్రాస్ అవుతున్నాడు. అదే సమయంలో అటువైపుగా ఓ ఆటో వేగంతో దూసుకొచ్చింది. రోడ్డు క్రాస్ అవుతున్న వ్యక్తిని తప్పించబోయి ఆటో డివైడర్ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఓ మహిళ సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. రోడ్డు క్రాస్ అవుతున్న వ్యక్తిని ఆటో ఢీకొట్టడంతో అతడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ర్యాస్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అంతేకాక ప్రమాద సమయంలో అక్కడున్న కొందర్ని అడిగి సమాచారం సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment