లక్కవరపుకోట: మండలంలోని మార్లాపల్లి గ్రామానికి చెందిన వివాహిత రమ(26) ఆదివారం ఉదయం ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పుడింది. ఈ సంఘటనపై ఎస్సై ముకుందరావు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గంట్యాడ మండలం రాకోడు గ్రామానికి చెందిన రమకు ఎల్.కోట మండలం మార్లాపల్లి గ్రామానికి చెందిన లెక్కల చిన్నంనాయుడుతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితంలో 5 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల వయస్సు గల బాబు ఉన్నారు. కాగా రమ భర్త చిన్నంనాయుడు విశాఖపట్నం ఉద్యోగ నిమిత్తం వెళ్లగా శనివారం రాత్రి ఇంటిలో ఆమె ఒక్కతే పడుకుంది. ఆదివారం తెల్లవారాక చూసేసరికి ఉరికి వేలాడి కనిపించింది. వెంటనే స్థానికులు ఎల్.కోట పోలీసులకు సమాచారం అందజేయగా ఘటనా స్థలానికి ఎస్సై ముకుందరావు సిబ్బందితో కలిసి వచ్చి పరిశీలించారు.
వేధింపులే కారణం
తన కూతురు చావుకు అల్లుడు, అత్త, మామల వేధింపులు, శారీరకంగా హింసించడం, అల్లుడు చిన్నంనాయుడికి వివాహేతర సంబంధంఉండడం కారణాలు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పుడినట్లు మృతురాలి తల్లి రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment