
శోభకు 36 రోజుల కిందట అరకలగూడు తాలూకాలోని ఇబ్బడి గ్రామానికి చెందిన నవీన్‌తో పెళ్ళి
మైసూరు: వేగంగా వచ్చిన లారీ బైకును ఢీకొన్న ప్రమాదంలో నవ వివాహిత మహిళ మృతి చెందిన సంఘటన అరకలగూడు వద్ద చోటు చేసుకుంది. కుశాల నగర దగ్గర సిగె హోసూరుకు చెందిన గణేష్ కుమార్తె ఎస్.జీ.శోభ (25) మృతురాలు. శోభకు 36 రోజుల కిందట అరకలగూడు తాలూకాలోని ఇబ్బడి గ్రామానికి చెందిన నవీన్‌తో పెళ్ళి జరిగింది. ఇద్దరూ కలిసి సోమవారం అరకలగూడు నుంచి హొళె నరసిపురకు బైకులో వెళ్తున్నారు.
ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. వారిద్దరూ కింద పడగా మీద నుంచి లారీ దూసుకెళ్లింది. తీవ్రగాయాలతో శోభ ఘటనాస్థలిలోనే కన్నుమూసింది. భర్తకు రెండు కాళ్ళు విరిగాయి, స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. హోళె నరిసిపుర గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.