
ప్రమాదంలో బాగా ధ్వంసమైన కారు
మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం దగ్గర బెంగళూరు – మైసూరు జాతీయ రహదారిలో వరుసగా కార్లు ఢీకొన్నాయి, ఈ ప్రమాదంలో ఒక కారు మంటల్లో కాలిపోయింది. శనివారం టీఎం హోసూరు గేట్ వద్ద.. బెంగళూరు నుంచి మైసూరుకు వెళుతున్న నాలుగు కార్లు అదుపుతప్పి ఢీకొన్నాయి. ఒక కారు నుజ్జునుజ్జు కాగా, మరో కారు మంటల్లో చిక్కుకుంది.
ఇంతలో స్థానికులు, పోలీసులు ఆ కారులోని వారిని బయటకు తీసుకురావడంతో ప్రాణనష్టం తప్పింది. శ్రీరంగ పట్టణంలో జరుగుతున్న దసరా ఏర్పాట్ల తనిఖీకి వెళుతున్న మండ్య జిల్లా ఎస్పీ యతీష్ ఇన్నోవా కారు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుంది. ఆ కారుకు నొక్కులు పడ్డాయి. ఆయన మరో కారులో వెళ్లిపోయారు. ఈ సంఘటనతో హైవేలో కొంతసేపు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.

దెబ్బతిన్న జిల్లా ఎస్పీ కారు

కాలిపోతున్న మరో కారు
Comments
Please login to add a commentAdd a comment