అరవపల్లి(నల్గొండ జిల్లా): అరవపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఓ మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన మహిళను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. మృతురాలు అరవపల్లి మండలం జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నోముల అవిలమ్మ(55)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.