లారీ ఢీకొని మృతి చెందిన మహిళ
తిరువొత్తియూరు: బైక్ చక్రంలో చీర తగులుకోవడంతో రోడ్డుపై పడిన మహిళపై లారీ దూసుకెళ్లింది. దీంతో సంఘటనా స్థలంలోనే ఆ మహిళ ప్రాణాలు విడిచింది. కడలూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. కడలూరు జిల్లా సేద్దియల్‌పురం సమీపం అల్లిలూర్ తూర్పు వీధికి చెందిన వీరమణి (45) ఎలక్ట్రీషియన్. ఇతను శనివారం భార్య వసంత (40)తో మోటారు సైకిల్‌పై సేద్దియాపురం వెళ్లాడు. అక్కడి నుంచి ఇద్దరు తిరిగి ఇంటికి బయలుదేరారు.
చెన్నై కుంభకోణం రోడ్డులో మేట్టువీధి వద్ద వసంత చీర బైక్ చక్రంలో చిక్కుకుంది. దీంతో వసంత, వీరమణి అదుపు తప్పి రోడ్డుపై పడ్డారు. ఆ సమయంలో బన్‌రూటి నుంచి కుంభకోణం వైపు వస్తున్న లారీ వసంతపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలం వద్దే వసంత మృతి చెందింది. గుర్తించిన స్థానికులు తీవ్రంగా గాయడప్డ వీరమణిని చిదంబరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సేద్దియపురం పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేసి వసంత మృతదేహాన్ని శవపరీక్ష కోసం చిదంబరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment