![ఎమ్మెల్యే కారు ఢీకొని యువతి మృతి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81451386308_625x300.jpg.webp?itok=zSq_on4K)
ఎమ్మెల్యే కారు ఢీకొని యువతి మృతి
లక్నో: ఎమ్మెల్యే కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అహ్మద్పుర్ లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అజంఘడ్ లోని నిజామాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అలంబడి కారు అహ్మద్పుర సమీపానికి రాగానే ఓ బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తోన్న ఓ మహిళ(26) అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే అలంబడి కారులో ఉన్నారా.. లేదా.. అన్న విషయంలో స్పష్టత లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.