
ఆస్పత్రిలో తోపుడుబండిపై నిర్జీవంగా రేణుక
మదనపల్లె టౌన్: 108కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఓ పేద మహిళ నిండు ప్రాణాన్ని కోల్పోయింది. మదనపల్లెలోని బెంగళూరు రోడ్డులో నివాసం ఉంటున్న బి.రేణుక(35) కుటుంబ కలహాల కారణంగా భర్త ప్రసాద్ నుంచి విడిపోయింది. కొత్తిమీర విక్రయించుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. శుక్రవారం రాత్రి ఉన్నట్టుండి ఆమెకు ఛాతీలో నొప్పి వచ్చింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. 108కు ఫోన్ చేశారు. అయితే అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రేణుక వద్ద ఆటోలో వెళ్లేందుకు డబ్బు లేకపోవడంతో స్థానికులు కొత్తిమీర అమ్ముకునేందుకు వినియోగించే తోపుడు బండిపైనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధ్రువీకరించారు. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment