ప్రభుత్వాస్పత్రి వద్ద పేలుడు కలకలం | minor blast takes place near karimnagar government hospital | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 2 2015 2:55 PM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM

కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఒక చెత్తకుండీ వద్ద పేలుడు కలకలం సృష్టించింది. అక్కడ చెత్త ఏరుకునే దుర్గయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలకు, చేతులకు గాయాలయ్యాయి. పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పేలుడుకు కారణాలు ఏంటో ఇంకా తెలియట్లేదు. ఆస్పత్రిలో పనికిరాని రసాయనాలు ఏవైనా అక్కడ పారేస్తే పేలాయా, ఎవరైనా పేలుడు పదార్థాలు పెట్టారా అనే విషయం తెలియాల్సి ఉంది. పేలుడు ధాటికి ఒక ప్లాస్టిక్ టిన్ను తునాతునకలైపోయింది. దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపారు. ఆ నివేదిక వస్తే తప్ప కారణం ఏంటన్నది తెలియదు. నాలుగు రోజుల క్రితం ఏకే-47 కు సంబంధించిన బానెట్ దొరికింది. వారంలోనే రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement