minor blast
-
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు
న్యూఢిల్లీ: ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఎదుట శుక్రవారం సాయంత్రం ఐఈడీ పేలుడు సంభవించింది. హై సెక్యూరిటీ జోన్‌లోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో సంభవించిన ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో దౌత్య కార్యాలయం సమీపంలోని ఓ పూలకుండీలో ఉంచిన ఐఈడీ పేలింది. దాని తీవ్రతకు దగ్గర్లో పార్కు చేసిన మూడు కార్ల అద్దాలు మాత్రం పగిలిపోయాయని పోలీసులు తెలిపారు. సంచలనాన్ని సృష్టించేందుకు చేసిన ప్రయత్నమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తినష్టం వాటిల్లలేదు. అయితే, అదే సమయంలో కొద్ది కిలోమీటర్ల దూరంలో రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ తదితరులు రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనడం గమనార్హం. ఘటన నేపథ్యంలో విదేశాంగ మంత్రి జై శంకర్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గబి అష్కెనాజీతో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందికి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామనీ, బాధ్యులను వదిలిపెట్టబోమని ప్రభుత్వం ట్విట్టర్లో తెలిపింది. విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రోతోపాటు ముఖ్యమైన, కీలక ప్రభుత్వ విభాగాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సీఐఎస్ఎఫ్కు ఆదేశాలు అందాయి. -
కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి వద్ద పేలుడు
వృద్ధుడికి తీవ్రగాయాలు కరీంనగర్ క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద గురువారం మధ్యాహ్నం పేలుడు జరిగింది. ప్రభుత్వాసుపత్రిని ఆనుకుని కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనం ముందు డ్రైనేజీ వద్ద తిమ్మాపూర్ మండలం మొగిలి పాలెం గ్రామానికి చెందిన దుద్దెన దుర్గయ్య(70) పాత వస్తువులు ఏరుకుంటున్నాడు. మెడికల్ కాలేజీ మెయిన్ గేట్ వద్ద ఒక ప్లాస్టిక్ క్యాన్ కనిపించగా దానిని తీయడంతో అది ఒక్కసారిగా భారీశబ్దంతో పేలింది. ప్రమాదంలో దుర్గయ్యకు ముఖం, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ఈ సమాచారంతో ఓఎస్డీ సుబ్బారాయుడు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పేలుడుకు అనుమానాస్పద పదార్థం ఉంచిన ప్లాస్టిక్ క్యాన్ చిన్న, చిన్న ముక్కలై సుమారు 300 మీటర్ల వరకు ఎగిరిపడ్డాయి. దుర్గయ్య మురుగు కాల్వపై ఉండడంతో పేలుడు తీవ్రత కాల్వపై ఉన్న సిమెంట్ బిళ్లపై పడింది. విగ్రహాల తయారీలో వాడే రసాయనం వల్లే పేలుడు సంభవించిందని కరీంనగర్ డీఎస్పీ రామారావు పేర్కొన్నారు. అయితే ఆ ప్రాంతంలో విగ్రహాల తయారీ పరిశ్రమలేవీ లేవు. పేలుడు జరిగిన ప్రదేశంలో చెత్తాచెదా రం కూడా లేదు. మరి ఎందుకు క్యాన్ అక్కడ పడవేశారనేది తేలాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ పరిశీలించారు. ప్రజలు భయూం దోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్పీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు. -
'ఆ పేలుడుకు కారణం రసాయనాలే'
కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఒక చెత్తకుండీ వద్ద పేలుడుకు గల కారణాన్ని పోలీసులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికతో ఈ విషయం నిర్ధారణ అయింది. విగ్రహాల తయారీకి ఉపయోగపడే ప్లాస్టో పారిస్ రసాయనాల కలయికే కారణమని ఎస్పీ జోయల్ డేవిస్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ పేలుడుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు ఎస్పీ జోయల్ తెలిపారు. కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఒక చెత్తకుండీ వద్ద పేలుడు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పేలుడు ధాటికి ఒక ప్లాస్టిక్ టిన్ను తునాతునకలైపోయింది. దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో అక్కడ చెత్త ఏరుకునే దుర్గయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలకు, చేతులకు గాయాలయ్యాయి. పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. -
ప్రభుత్వాస్పత్రి వద్ద పేలుడు కలకలం