బైక్‌ను ఢీకొన్న స్కార్పియో
-
యువకుడి పరిస్థితి విషమం
సంగం : మోటార్‌బైక్‌ను స్కార్పియో ఢీకొనడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని దువ్వూరు వద్ద శుక్రవారం జరిగింది. మండలంలోని గాంధీజనసంఘంకు చెందిన ఇంటా కిరణాకుమార్‌రెడ్డి తన మోటార్‌బైక్‌లో నెల్లూరుకు వెళ్లి ఇంటికి వస్తుండగా దువ్వూరు వద్ద లారీని తప్పించబోయే క్రమంలో వేగంగా వచ్చిన స్కార్పియో ఢీకొంది. దీంతో కిరణ్‌కుమార్‌రెడ్డి బైక్ పైనుంచి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రథమ చికిత్స చేసి నెల్లూరుకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వారు తెలిపారు. సమాచారం అందుకున్న సంగం ఎస్‌ఐ వేణు సంఘటన స్థలానికి వచ్చి ప్రమాదానికి కారణమైన స్కార్పియోను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.