పుంగనూరు (చిత్తూరు జిల్లా) : వేగంగా వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండల కేంద్రంలో జాతీయరహదారిపై ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న కారు.. మలుపు వద్ద బైక్‌ను ఢీ కొనడంతో కర్ణాటకకు చెందిన ఫోటోగ్రాఫర్‌గా అనుమానిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందాడు.
కాగా బైక్‌పై ఉన్న అతని కుమార్తె గాయపడటంతో మదనపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె షాక్‌కు గురికావడంతో వారి వివరాలు తెలియడంలేదని పోలీసులు తెలిపారు. ఆమె షాక్ నుంచి తేరుకున్నాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు, బైక్ ఢీ : ఒకరు మృతి
Published Sun, Aug 23 2015 9:30 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement