కడప: వైఎస్సార్ జిల్లాలో దారుణం జరిగింది. కడప పట్టణంలోని చిన్న చౌక్ వద్ద గురువారం ఉదయం ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు.
స్థానికంగా నివాసముంటున్న బండి మునిరెడ్డి(35) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా ఒక ల్యాండ్‌కు సంబంధించిన వివాదంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం రోడ్డుపై టీ తాగుతున్న మునిరెడ్డిని కారులో వచ్చిన పదిమంది గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా కత్తులతో దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.