కొలిమిగుండ్ల (కర్నూలు) : ట్రాక్టర్ బైకును ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని జమ్మలమడుగు రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. దీంతో బైక్పై ఉన్నవారిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది.