ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని అహోబిలం బైపాస్‌రోడ్డులో ఓ బైక్‌ను స్కార్పియో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు నంద్యాల వైపు బైక్పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన స్కార్పియో వాహనం ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.