గుంటూరు: గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున చిలకలూరిపేటలో ముగ్గురు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందగా మరో యువకుడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. గుంటూరు వైఎస్సార్‌సీపీ నేత చోటానాయక్ కుమారుడు ఈ ప్రమాదంలో మృతిచెందారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి చోటానాయక్‌ను పరామర్శించి..ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి
Published Sat, Apr 30 2016 11:39 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement