పాతపట్నం(శ్రీకాకుళం): ఆర్టీసీ బస్సులోంచి దిగుతున్న వ్యక్తిని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని నవతల జంక్షన్ వద్ద శనివారం జరిగింది. వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న తోట కృష్ణమూర్తి(45) శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులోంచి దిగుతున్న సమయంలో.. శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఆటో అతడిని ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు.