చుండూరు(గుంటూరు): కుటుంబకలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి సుస్మిత(35), కూతురు(5) మృతి చెందగా.. కుమారుడు(3) తీవ్రగాయాల పాలయ్యాడు. అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గుంటూరు జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లిలో బుధవారం అర్దరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు సుస్మిత(35)ది హైదరాబాద్ కాగా, ఆమె భర్త గుజరాత్‌లో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.