మోటారు సైకిళ్లు ఢీకొని వ్యక్తి దుర్మరణం | bikes clash.. man dead | Sakshi
Sakshi News home page

మోటారు సైకిళ్లు ఢీకొని వ్యక్తి దుర్మరణం

Published Mon, Jul 25 2016 2:05 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

bikes clash.. man dead

కొవ్వూరు : మండలంలోని ఔరంగబాద్‌ సమీపంలో ఆదివారం వేకువజామున రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో సాగిరాజు శ్రీనివాసకుమారరాజు (43) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. దేవరపల్లికి చెందిన  కుమారరాజు మోటారు సైకిల్‌పై వెళుతుండగా ఔరంగబాద్‌ సమీపంలో 5.30–6.00 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీకొట్టింది. దీంతో కుమారరాజుకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు విజ్జేశ్వరంలో శెనగన వీర్రాజుకు చెందిన డీసీఎం వ్యాన్‌పై డ్రైవర్‌ పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీర్రాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎస్‌ఎస్‌ఎస్‌ పవన్‌కుమార్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement