కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు మండలం వసంతపురం గ్రామంలో ప్రత్యర్థులు చేసిన దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ప్రత్యర్థులు బరిసెలతో జరిపిన దాడిలో తుమ్ము నాగేశ్వరరావు (50) మృతి చెందగా... దాడిని అడ్డుకునేందుకు వచ్చిన ఆయన కుమారులు నాగార్జున, మురళి తీవ్రంగా గాయపడ్డారు.
వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థి నాగార్జున సాయంత్రం కన్నుమూశాడు. మురళి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఏ క్షణంలో ఏమవుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాగా, అదే గ్రామానికి చెందిన వసంతులు, వెంకటసుబ్బయ్య, మల్లికార్జునలు నాగేశ్వరరావు ఇంటిపై దాడి చేసినట్లు సమాచారం.
ప్రత్యర్థుల దాడిలో తండ్రీకొడుకులు హతం
Published Sun, Jul 5 2015 7:40 PM | Last Updated on Thu, Aug 16 2018 4:21 PM
Advertisement
Advertisement