opponents attacked
-
చిక్కమగళూరులో బీజేపీ మైనారిటీ నేత హత్య
జయనగర: కర్ణాటకలోని చిక్కమగళూరులో బీజేపీ మైనారిటీ నేత మహ్మద్ అన్వర్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా కేంద్రం బసవనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గౌరీకాలువ ప్రాంతం లో జరిగింది. బీజేపీ చిక్కమగళూరు ప్రధాన కార్యదర్శిగా ఉన్న మహ్మద్ అన్వర్ (46) శుక్రవారం రాత్రి 9.35 గంటల సమయంలో తన ఇంటి వద్ద కారు దిగుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయన్ను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ హత్యతో చిక్కమగళూరులో శనివారం దుకాణాలు మూసి వేయడంతో బంద్ వాతావరణం కనిపించింది. జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించారు. వ్యక్తిగత కక్షలతోనే ప్రత్యర్థులు దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులకు అడ్డుగోడగా నిలిచినందునే అన్వర్‌ను పొట్టనబెట్టుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి మండిపడ్డారు. -
ప్రత్యర్థుల దాడిలో తండ్రీకొడుకులు హతం
కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు మండలం వసంతపురం గ్రామంలో ప్రత్యర్థులు చేసిన దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ప్రత్యర్థులు బరిసెలతో జరిపిన దాడిలో తుమ్ము నాగేశ్వరరావు (50) మృతి చెందగా... దాడిని అడ్డుకునేందుకు వచ్చిన ఆయన కుమారులు నాగార్జున, మురళి తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థి నాగార్జున సాయంత్రం కన్నుమూశాడు. మురళి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఏ క్షణంలో ఏమవుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాగా, అదే గ్రామానికి చెందిన వసంతులు, వెంకటసుబ్బయ్య, మల్లికార్జునలు నాగేశ్వరరావు ఇంటిపై దాడి చేసినట్లు సమాచారం.