పరీక్ష కోసం వెళ్తూ నవవధువు మృతి | newly married lady died in lorry slipped incident in visakhapatnam | Sakshi
Sakshi News home page

పరీక్ష కోసం వెళ్తూ నవవధువు మృతి

Dec 19 2015 7:39 AM | Updated on Sep 3 2017 2:15 PM

పరీక్ష కోసం వెళ్తూ నవవధువు మృతి

పరీక్ష కోసం వెళ్తూ నవవధువు మృతి

విశాఖపట్టణం జిల్లా అనంతగిరి శివారులో శనివారం ఉదయం లారీ బోల్తాపడి నవ వధువు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

అనంతగిరి: విశాఖపట్టణం జిల్లా అనంతగిరి శివారులో శనివారం ఉదయం లారీ బోల్తాపడి నవ వధువు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతగికిరికి చెందిన నిత్య(21)కు వారం రోజుల కిందటే వివాహం అయింది. వైజాగ్‌లో శనివారం ఉదయం 10 గంటలకు పరీక్ష ఉండగా రాసేందుకు మామతో పాటు బయలుదేరింది. బస్సులు లేకపోవడంతో వైజాగ్ వెళ్లే లారీ ఎక్కారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత లారీ ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ సంఘటనలో నిత్య అక్కడికక్కడే మృతిచెందగా ఆమె మామకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి తప్పించుకున్న లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడినుంచి పరారయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement