కేరళ కోర్టు ఆవరణలో పేలుడు కలకలం
తిరువనంతపురం: కేరళ మలప్పురం కోర్టు ఆవరణలో మంగళవారం పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోర్టు ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారులో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా, ఒకరు గాయపడ్డారు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని స్థానికులు, పోలీసులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్, బాంబ్ స్క్వాడ్ సిబ‍్బందితో సోదాలు చేపట్టారు.
దుండగులు ప్రెషర్ కుక్కర్ బాంబును అమర్చి పేల్చినట్టు పోలీసులు గుర్తించారు. కారు యజమాని హోమియో డీఎంవోదిగా గుర్తించారు. అలాగే ఘటనా స్థలంలో కరుడుకట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫోటోను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.