పిడుగుపాటుతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం కట్టేపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది.
పెద్దేముల్ (రంగారెడ్డి) : పిడుగుపాటుతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం కట్టేపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. ఉరుమలతో కూడిన వర్షం రాగా అదే సమయంలో ఓ ఇంటి సమీపంలో పిడుగుపడింది. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న శ్రీను(35), శివ(25), సుజాత(25), ప్రభు(23), ఉమ(18), పూజ(8)లు గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.