పిడుగు ఎక్కడ పడుతుందంటే... | LaCie Little Big Disk Thunderbolt 2 Hands-on Preview | Sakshi
Sakshi News home page

పిడుగు ఎక్కడ పడుతుందంటే...

Published Fri, Jan 10 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM

LaCie Little Big Disk Thunderbolt 2 Hands-on Preview

సాక్షి, ముంబై: వర్షాకాలంలో పిడుగు పడి మృతి చెందుతున్న ఘటనలను అరికట్టేందుకు వాతావరణశాఖ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. పిడుగులను గుర్తించే కొత్త యంత్రాన్ని కనిపెట్టడంలో ఈ శాఖ సఫలీకృతమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ, ఏ సమయంలో పిడుగులు పడతాయో అరగంట నుంచి రెండు గంటల ముందే తెలియజేసే సెన్సార్లను ఇది ఐఐటీ నుంచి సేకరించింది. వీటిని రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. వచ్చే వర్షాకాలం నుంచి ఈ సెన్సార్లు పనిచేయడం ప్రారంభస్తాయని ముంబై వాతావరణ శాఖ కార్యాలయం తెలిపింది.

వర్షాకాలం వచ్చిందంటే రైతులు, వారి దగ్గర పనిచేసే కూలీల్లో గుబులు మొదలవుతుంది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో అనేకచోట్ల పిడుగులు పడతాయి. పశువుల పాకలు, చెట్టు కింద తలదాచుకున్నా అక్కడ కూడా పిడుగులు పడుతున్నాయి. దీంతో ఏటా వందలాది మంది రైతులు, కూలీలు దుర్మరణం పాలవుతున్నారు. దీన్ని అరికట్టేందుకు వాతావరణశాఖ పుణే ఐఐటీని సంప్రదించింది. ఈ సంస్థే పిడుగులు గుర్తించే సెన్సార్లను తయారు చేసి ఇచ్చిందని వాతావరణశాఖ వర్గాలు తెలిపాయి. వీటి నియంత్రణ కేంద్రం (కంట్రోల్ రూం) ఐఐటీ కార్యాలయంలో ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో పిడుగులు  ఎక్కడ, ఏ స్థాయిలో పడతాయనే వివరాలు కచ్చితంగా తెలుస్తాయని ఈ ప్రాజెక్టు చీఫ్, ఐఐటీ సీనియర్ శాస్త్రజ్ఞులు డాక్టర్ సునీల్ పవార్, వి.గోపాలకృష్ణ, పి.ముర్గువెల్ వెల్లడించారు. వీటి తయారీకి అమెరికాకు చెందిన అర్థ్ నెట్‌వర్క్ అనే కంపెనీ నుంచి పరికరాలను దిగుమతి చేసుకున్నారు.
 
 ఉరుములు, మెరుపులు, పిడుగుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ పరిమాణం, అవి ఏ స్థాయిలో నేలపై పడతాయి తదితర కీలక అంశాలను అధ్యయనం చేసేందుకు వీలుపడుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఈ సెన్సార్లు 200-250 కిలోమీటర్ల దూరంలోని పిడుగుల వివరాలను కూడా తెలియజేస్తాయి. ఐఐటీ వెబ్‌సైట్‌లో స్థానికులు తమ మొబైల్ నంబర్లు, గ్రామం పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడి వాతావరణ వివరాలు అందులో లభిస్తాయని పవార్ అన్నారు.
 
 అయితే వర్షాకాలంలో ప్రతీ ఐదు, పది నిమిషాలకు ఒకసారి ఎస్‌ఎంఎస్‌లు పంపడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రిత్వశాఖతో చర్చలు జరుపుతున్నామని పవార్ తెలిపారు.  
 
 వీటిని ఎక్కడ ఏర్పాటు చేశారు...........
     మధ్య మహారాష్ట్ర-పుణే, మహాబలేశ్వర్, కొల్హా పూర్, షోలాపూర్, నాసిక్, జల్గావ్, నందూర్బార్.
     కొంకణ్ రీజియన్-ముంబై, హరిహరేశ్వర్ , రత్నగిరి, వెంగుర్లే.
     మరఠ్వాడా రీజియన్-ఔరంగాబాద్, బీడ్, లాతూర్, పర్భణి
     విదర్భ రీజియన్-నాగపూర్, అకోలా, యవత్మాల్, గోండియా, చంద్రపూర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement