పిడుగుపడి వ్యవసాయ కూలీ మృతి
చేర్యాల : పిడుగుపాటుతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని ఆకునూరులో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఆకునూరు గ్రామానికి చెందిన తాటికొండ బొందమ్మ(50) వ్యవసాయ కూలీకి వెళ్లి ఇంటికి తిరుగుపయనమైంది. ఈ క్రమంలో ఆమె ఆకునూరులోని గంగమ్మ గుడి సమీపంలోని పెద్దవాగులో నుంచి వస్తుండగా సమీపంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త వెంకటస్వామి, కుమార్తె ఉన్నారు. ఆ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి, మాజీ సర్పంచ్ లావణ్యరఘువీర్, పల్లె కనకయ్య, శనిగరం నరేందర్, ఎండీ.హైమత్, మోంటె ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.