జి.కొండూరు (కృష్ణా) : పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీ ఒకరు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా వినుకొండ మండలానికి చెందిన అమరపూడి దావీదు(35) మండలంలోని ముత్యాలంపాడు(హెచ్)లో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.
కాగా ఆయన సోమవారం గ్రామంలోని ఓ రైతుకు చెందిన పొలంలో వరి నాటు వేశాడు. ఇంటికి తిరిగి వచ్చేందుకు బయలుదేరుతుండగా చిన్నగా వర్షం మొదలైంది. అంతలోనే హఠాత్తుగా ఆయనపై పిడుగు పడింది. దీంతో దావీదు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.
పిడుగుపాటుతో వ్యక్తి మృతి
Published Mon, Sep 7 2015 7:40 PM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM
Advertisement
Advertisement