కెరమెరి, న్యూస్‌లైన్ : కెరమెరి మండలం అంతా కూడా గాలివానతో అతలాకుతలం అయింది. హట్టి, సాకడ, గోయేగాంలోని ప్రధాన రహదారులతో పాటు పోలీస్‌స్టేషన్ ఎదుట చెట్లు విరిగిపడ్డాయి. ఆయా దారుల్లో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. హట్టి, మోడి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో రూపాం తరం కింద నిర్మించిన భవనాల పైకప్పులు గాలికి లేచిపోయి పంట పొలాల్లో పడ్డాయి.
ఈ సమయంలో విద్యార్థులు కానీ, ఇతర పాఠశాల సిబ్బంది కానీ ఆ గదుల్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఝరిలో మూడు ఇళ్లు కూలిపోయాయి. మరికొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న జొన్న పంట నేలవాలింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు 30 ఇన్సులేటర్లు పాడైపోయాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
గాలివాన బీభత్సం
Published Sat, Apr 19 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM