Tribal residential schools
-
30న గురుకులాల్లో ‘బోధన సిబ్బంది’ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో బోధనా సిబ్బంది ఖాళీలకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన చేపట్టిన నియామక పరీక్ష ఈ నెల 30 న నిర్వహిస్తున్నట్లు ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తె లిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 11-1 గంటల మధ్య రాతపరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష హాలుకు రావాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలిపారు. హాల్‌టికెట్లను www.tgtwgurukulam.telangana.gov.inలో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. -
గాలివాన బీభత్సం
కెరమెరి, న్యూస్‌లైన్ : కెరమెరి మండలం అంతా కూడా గాలివానతో అతలాకుతలం అయింది. హట్టి, సాకడ, గోయేగాంలోని ప్రధాన రహదారులతో పాటు పోలీస్‌స్టేషన్ ఎదుట చెట్లు విరిగిపడ్డాయి. ఆయా దారుల్లో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. హట్టి, మోడి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో రూపాం తరం కింద నిర్మించిన భవనాల పైకప్పులు గాలికి లేచిపోయి పంట పొలాల్లో పడ్డాయి. ఈ సమయంలో విద్యార్థులు కానీ, ఇతర పాఠశాల సిబ్బంది కానీ ఆ గదుల్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఝరిలో మూడు ఇళ్లు కూలిపోయాయి. మరికొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న జొన్న పంట నేలవాలింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు 30 ఇన్సులేటర్లు పాడైపోయాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు.