విశాఖ జిల్లా భీమిలి మండలం పసుకుడి గ్రామంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు.
విశాఖపట్నం: విశాఖ జిల్లా భీమిలి మండలం పసుకుడి గ్రామంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. మోహన్‌గౌడ్ (50) శనివారంపశువులను మేపేందుకు వెళ్లగా మధ్యాహ్నం సమయంలో సమీపంలోనే పిడుగు పడడంతో మృతి చెందాడు.
మరోవైపు శ్రీకాకుళం జిల్లా బామిని మండలం పసికిడిలో పిడుగుపాటుకు మరో వ్యక్తి మృతి చెందాడు. ఇదే మండలంలో లోహరిగోలలో పిడుగుపాటుకు 50 గొర్రెలు మృతి చెందాయి.