
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం జిల్లా : అనకాపల్లి మండలం తమ్మయ్యపేటలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా హేమంత్(18), పవన్‌కుమార్(18) అనే ఇద్దరు యువకులపై పిడుగుపడింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు కాశీంకోట మండలం విస్సన్నపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
మృతదేహాలను అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించారు. కుమారులతో మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. హేమంత్, పవన్‌లు క్రికెట్ ఆడుతున్న సమయంలో ఉరుములు, మెరుపులు వస్తుండటంతో దగ్గరలోని చెట్టుకిందకు వెళ్లారు. ఆ సమయంలో అకస్మాత్తుగా పడటంతో వారు చనిపోయారు.