మదిగూడ/వలిగొండ (నల్లగొండ) : పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందిన సంఘటనలు నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నాయి. మర్రిగూడ మండలం నర్సింహాపురంలో ఒకరు మృతి చెందగా, వలిగొండలో మరో ఇద్దరు మృతి చెందారు. నర్సింహాపురానికి చెందిన యాదయ్య(55) తన పొలంలో వ్యవసాయ పనులకు వెళ్లాడు. సాయంత్రం పొలంలో ఉండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.
ఆ సమయంలో పొలంలో ఉన్న యాదయ్యపై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే వలిగొండ మండలం షంగ్యిం సమీపంలో బైకుపై వెళుతున్న ఇద్దరిపై పిడుగుపడగా వారు అక్కడిక్కడే మృతి చెందారు. భువనగిరి మండలం బొల్లపల్లికి చెందిన వనకళి నర్సింహా(40), గొటికె శ్రీశైలం(40)లుగా మృతులను గుర్తించారు.