
పిడుగుపాటుకు మృతిచెందిన మేకలు
పిడుగుపాటుకు 13మేకలు మృతి చెందిన సంఘటన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలోని సంగాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
గజ్వేల్‌రూరల్: పిడుగుపాటుకు 13మేకలు మృతి చెందిన సంఘటన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలోని సంగాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పోతగల్ల మల్లయ్య తన మేకలను తోలుకుని గురువారం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. కాగా సాయంత్రం సమయంలో కురిసిన వర్షాలకు మేకల మంద పిడుగు పాటుకు గురైంది.
ఈ ప్రమాదంలో 13 మేకలు అక్కడికక్కడే మృతి చెందగా, వాటి యజమాని మల్లయ్యకు సైతం గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న వీఆర్వో ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అయితే పిడుగుపాటుకు తన మందలోని 13 మేకలు మృతి చెందాయని, దీంతో తనకు భారీ ఆస్తి నష్టం సంభవించిందని, ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని మల్లయ్య విజ్ఞప్తి చేస్తున్నాడు.