కారంపూడి(గుంటూరు): పొలంలో మిరపకాయలు కోస్తున్న బాలుడిపై పిడుగు పడి దుర్మరణం చెందగా, మరో మహిళకు కళ్లు కన్పించకుండా పోయిన ఘటన గుంటూరు జిల్లా కారంపూడి మండలం కాచవరం గ్రామంలో జరిగింది. వివరాలివీ.. గ్రామంలోని ఉత్తరపు పొలంలో కూలీలు మిరపకాయలు కోస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే చేలో పిడుగు పడింది. మిరపకాయలు కోస్తున్న కేతావతు రాజానాయక్(11) పిడుగు పాటుకు అక్కడికక్కడే మృతి చెందాడు.
పొలం యజమానురాలు సయ్యద్ కాసింబీకి మెరుపు కళ్లలో పడడంతో ఆమె కళ్లు తెరవడానికి వీల్లేకుండా మూసుకు పోయాయి. కాగా, రాజానాయక్‌కు తల్లి లేదు. తండ్రితో పాటు నల్లగొండ జిల్లా దేవరకొండ దగ్గరున్న నీలకుంట గ్రామం నుంచి మరికొందరితో కలసి వలస కూలీగా వచ్చాడు.