సుల్తానాబాద్ (కరీంనగర్): పిడుగుపాటుతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్ధాల గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన అరవింద్రెడ్డి (25) అనే యువకుడు శనివారం తెల్లవారుజామున పిడుగుపాటుతో మృతి చెందాడు. కాగా, మృతుడు బీజేపీ సీనియర్‌నేత వెంగల్‌రావు కుమారుడిగా సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.