పిడుగుపడి ఇద్దరి మృతి | two dead due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపడి ఇద్దరి మృతి

Published Fri, Jul 29 2016 11:27 PM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM

పిడుగుపడి ఇద్దరి మృతి - Sakshi

పిడుగుపడి ఇద్దరి మృతి

చాట్రాయి:
 పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన. మండలంలోని చీపురుగూడెం గ్రామానికి చెందిన తుర్లపాటి మారేష్‌(26) లింగారెడ్డి రాణి, చైతన్య కలసి గ్రామంలోని కాకర తోటలో శుక్రవారం సాయంత్రం పనిచేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండడంతో తోటలోఉన్న చెట్టు కిందకు వచ్చారు. అదే సమయంలో పిడుగు పడింది. ఈ సంఘటనలో మారేష్‌ అక్కడిఅక్కడే మృతి చెందాడు. రాణి, చైతన్యలకు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమించడంతో చింతలపూడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నంపేట గ్రామానికి చెందిన కొమ్ము నాగేశు(40) మరో 10 మంది కూలీలు చింతలపూడి మండలం గండిచర్ల గ్రామంలో వరినాట్లు వేసేందుకు వెళ్లారు. వర్షం కురుస్తుండడంతో దగ్గర్లో ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో చెట్టు కింద ఉన్న కూలీలపై పిడుగు పడడంతో నాగేశు అక్కడిఅక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన బాలస్వామిని చింతలపూడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి బార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 
మృతులు ఇద్దరూ కూలీలే..
పిడుగుపాటుకు గురై మృతి చెందిన ఇద్దరు, తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులు నిత్యం కూలి పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement