ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం పిడుగుపాటు ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం పిడుగుపాటుకు ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. సాయంత్రం వరకు ఎండలు, ఉక్కపోతలతో ఉన్న వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో వర్షంతోపాటు ఉరుములు మెరుపులతో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. దీంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న కాగజ్‌నగర్‌లో మండలంలోని చింతగూడ గ్రామంలో చింతచెట్టు కింద ఉన్న మెస్రం గిరిజాబాయి(16), దరిగాం గ్రామంలో ఆత్రం అయ్యూబాయి(16)లు మరణించారు. అలాగే, బెజ్జూర్ మండలంలో పోతపల్లి గ్రామంలో పత్తిచేనులో విత్తనాలు నాటుతుండగా ఆత్రం లలిత(20) అనే డిగ్రీ విద్యార్థిని, కౌటాల మండలంలోని తాడిపల్లిలో పొలం పనులు చేసుకుంటుండగా తుమ్మిడి మంగళబాయి(28), రౌతు ఉద్దవ్(30), బాబాసాగర్ గ్రామంలో రౌతు వెంకటేశ్(29), చింతమానపల్లి గ్రామంలో పూజారి పార్వతి(22), చెన్నూర్ మండలం సోమారంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బట్టె దుర్గయ్య (32) పిడుగుపాటుతో మృత్యువాతకు గురయ్యారు.