పిడుగుపడి భారీగా ఎగసిన మంటలు | huge fire happened due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపడి భారీగా ఎగసిన మంటలు

Published Wed, Jun 3 2015 8:40 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

పిడుగుపడి భారీగా ఎగసిన మంటలు

పిడుగుపడి భారీగా ఎగసిన మంటలు

బి.కొత్తకోట: చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని కోటావూరు గ్రామం సమీపంలో ఓ గుట్టపై బుధవారం పిడుగు పడగా ఆ ప్రాంతంలో మంటలు ఎగసిపడ్డాయి. గుట్టపై 33 కేవీ విద్యుత్‌లైన్ దగ్గర బుధవారం తెల్లవారుజామున పిడుగుపడింది. గుట్టపై ఉన్న విద్యుత్ స్తంభం వద్ద పొగలు వస్తుండడాన్ని గుర్తించి గ్రామస్తులు అక్కడికెళ్లి చూడగా... భూమి చీలినట్టు ఉండి మంటలు ఎగసిపడడం కనిపించింది. సర్పంచ్ జయచంద్రారెడ్డి విద్యుత్ శాఖ ఏఈకి సమాచారం ఇవ్వడంతో సరఫరా నిలిపివేశారు. ఏఈ గుట్టవద్దకు చేరుకుని ట్యాంకర్లతో నీటిని తెప్పించి పోయించారు. మంటలు ఆరిపోయినా లోపలి నుంచి ఆవిర్లు, వేడి మాత్రం తగ్గలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement