
సాక్షి, వరంగల్ : జిల్లాలోని రెండు వేర్వేరు గ్రామాల్లో పిడుగు పడి ఇద్దరు మరణించారు. మృతులు ఆత్మకూరు మండలం, అక్కంపేట గ్రామానికి చెందిన మహిళ పూలమ్మ(40), గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామానికి చెందిన రైతు దూడయ్య(45)గా అని గ్రామస్తులు తెలిపారు. జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులు కూడా పడడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment