Indian Metereological Department
-
ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత్ వాతావరణ శాఖ చల్లని కబురు
-
Anna Mani: నాన్నా.. నేనెందుకు చదువుకోకూడదు?!
ఒకప్పటి పరిస్థితులు వేరే!. పురుషాధిక్య సమాజంలో పలు రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం తక్కువగానే ఉండేది. అయితే అలాంటి తారతమ్యాలను నిలదీసి.. తాను ఎందులోనూ ఎవరికీ తీసిపోనని నిరూపించుకున్నారు అన్నా మణి. విచిత్రమేంటంటే.. ఆమె పోరాటం మొదలైంది ఇంటి నుంచే!. అన్నా మణి.. భారత వాతావరణ సూచన తల్లి mother of Indian weather forecast గా పేర్కొంటారు. 1918 కేరళ పీర్మేడ్లో సిరియన్-క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారామె. చాలా ఉన్నత కుటుంబం, విద్యావంతుల కుటుంబం ఆమెది. కానీ, ఆడబిడ్డలు వివాహానికే పరిమితం కావాలనే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పే పోరాటం చేసింది అన్నా మణి. తాను చదువుకోవాలని.. చదువు తన హక్కుగా పేర్కొంటూ తండ్రిని ఒప్పించి.. స్కూల్లో చేరింది. బాల మేధావిగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఉపన్యాసకురాలిగా, వాతావరణ నిపుణురాలిగా.. అన్నింటికి మించి భారత వాతావరణ శాఖకు ఆమె అందించిన సేవలు.. ఈనాటికీ చిరస్మరణీయం. అన్నా మణి జయంతి నేడు(ఆగస్టు 23). ఈ 104వ జయంతి ఉత్సవాల సందర్భంగా.. భారత వాతావరణ సూచన తల్లికి గౌరవార్థం గూగుల్ డూడుల్ రిలీజ్ చేసింది గూగుల్. ► తన ఎనిమిదవ పుట్టినరోజుకు ఇంట్లో వాళ్లు డైమండ్ ఇయర్ రింగ్స్ కానుకగా ఇచ్చారు. కానీ, అన్నా మణి మాత్రం వాటిని తీసుకోలేదు. వాటికి బదులు.. Encyclopædia Britannica కావాలని ఆమె పెద్ద గొడవే చేసిందట. ► పబ్లిక్ లైబ్రరీలో పుస్తకాలను పన్నెండేళ్ల వయసులోనే తిరగేసింది. బాల మేధావిగా గుర్తింపు. ► మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నారు. నారీ శక్తికి ఉదాహరణగా.. దేశభక్తిని ప్రదర్శించింది. ► చెన్నైలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారామె. ► ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో.. రీసెర్చ్ స్కాలర్షిప్ గెల్చుకుంది. ► లండన్ ఇంపీరియల్ కళాశాలలో ఫిజిక్స్ అభ్యసించింది. కానీ, ఆ తర్వాత వాతావరణ శాస్త్రం పట్ల ఆసక్తికనబర్చింది. ► పీహెచ్డీ కల మాత్రం కలగానే మిగిలిపోయింది అన్నా మణికి. ► డబ్యూసీసీలో ఉపన్యాసకురాలిగా పని చేయడంతో పాటు.. సీవీ రామన్ దగ్గర ఐఐఎస్‌లో స్పెక్ట్రోస్కోపీ అభ్యసించారామె. ► 1948లో భారత్‌ను తిరిగొచ్చిన ఆమె.. ఆమె భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 వాతావరణ పరికరాలను ప్రామాణికం చేసింది. ► వాయు వేగం, సోలార్ ఎనర్జీ కొలమానం కోసం పరికరాలను తయారు చేసి.. వాటితో ఒక వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. ► పురుషాధిక్య సమాజం.. రంగంలోనూ ఆమె తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ► భారత వాతావరణ శాఖ ఐఎండీకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా ఆమె విధులు నిర్వహించారు. ► 1987లో ఐఎన్ఎస్ఏ కేఆర్ రామనాథన్ మెడల్‌తో ఆమెను సత్కరించింది ప్రభుత్వం. ► గుండె సంబంధిత సమస్యలతో.. 2001, ఆగస్టు 16న ఆమె కన్నుమూశారు. ► సోలార్ రేడియేషన్, ఓజోన్, విండ్ ఎనర్జీ కొలమానం కోసం ఎన్నో పరిశోధనలు చేసి.. వ్యాసాలు రాశారు. ► కేవలం తన విద్యా-విజ్ఞాన సుముపార్జన, ఆసక్తి ఉన్న రంగంపైనే దృష్టి పెట్టిన ఆమె వివాహానికి దూరంగా ఉన్నారు. ► ప్రపంచ వాతావరణ సంస్థ 100వ జయంతి సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంది మరియు అన్నా ఇంటర్వ్యూతో పాటు ఆమె జీవిత ప్రొఫైల్‌ను ప్రచురించింది. -
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కేరళ వరకూ సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ఇదిలావుండగా.. నైరుతి రుతుపవనాల తిరోగమనం వాయువ్య భారత దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి బుధవారం ప్రారంభమైంది. మరోవైపు.. ఉత్తర అండమాన్ సముద్ర తీరంలో ఈ నెల 10వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈ నెల 14 లేదా 15వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరానికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. కాగా, గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పరిగిలో 64.5 మి.మీ., బాడంగిలో 58.5, హిందూపూర్‌లో 49, లేపాక్షిలో 46.5, కర్నూలులో 40, గొల్లపాడులో 38.5, గజపతినగరంలో 37.5, మార్కాపురం, ఓర్వకల్లులో 37, బొబ్బిలిలో 34.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
Heavy Rains: తెలంగాణలోని జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు తెలిపింది. రుతుపవనాల ద్రోణి తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. దీంతోపాటు ఉత్తర, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో ఐదురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఏపీలోనూ రాబోవు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నేడు, రేపు భారీ వర్షాలు... రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. సోమవారం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. మంగళవారం కూడా ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. నాగిరెడ్డిపేటలో 17 సెంటీమీటర్ల వర్షం... రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 17 సెం.మీ. వర్షం కురవగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో 15.4 సెం.మీ. వర్షం కురిసింది. నైరుతి సీజన్లో ఇప్పటివరకు 61.58 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఆదివారం నాటికి 78.86 సెం.మీ. వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి నాగరత్న తెలిపారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల భారీ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉత్తర కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
విశాఖ: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశావైపు అల్పపీడనం కదులుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రకు రెండ్రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్టణం తీరం వెంబడి గంటకు 45-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేటకు మత్య్సకారులు ఎవరూ వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
సాక్షి, వరంగల్ : జిల్లాలోని రెండు వేర్వేరు గ్రామాల్లో పిడుగు పడి ఇద్దరు మరణించారు. మృతులు ఆత్మకూరు మండలం, అక్కంపేట గ్రామానికి చెందిన మహిళ పూలమ్మ(40), గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామానికి చెందిన రైతు దూడయ్య(45)గా అని గ్రామస్తులు తెలిపారు. జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులు కూడా పడడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
అంచనాలు తగ్గించనున్న ఐఎండీ
న్యూఢిల్లీ: ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు రుతుపవనాలపై తన అంచనాలను భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా ఈ సీజన్ మొత్తానికి అంచనాలు దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఇప్పటికే అంచనాలను కుదించిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)ని 92 శాతంగా సవరించింది. ఎల్పీఏ 96–104 శాతం మధ్య ఉంటే, ఆ పరిస్థితిని సాధారణ వర్షపాతంగా భావిస్తారు. ఈ సీజన్లో 100 శాతం ఎల్పీఏతో వర్షాలు పడతాయని ఏప్రిల్‌లో ఐఎండీ అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
రైతులకు ‘అకాల’ దెబ్బ!
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ఆదివారం కూడా కొనసాగాయి. దీంతో మామిడి, టమాట, వరి, అరటి, దోస తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు కోలుకోలేని నష్టం సంభవించింది. కోతకు వచ్చే దశలో ప్రకృతి సృష్టించిన బీభత్సంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వడగండ్ల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి, టమోట, వరి పంటలు నేలపాలవ్వగా, రెండు పాడి ఆవులు మృతి చెందాయి. గత నెలలో కురిసిన అకాల వర్షానికి దాదాపు 40 వేల హెక్టార్లలో మామిడి పూత పూర్తిగా దెబ్బతింది. అదేగాక తూర్పు మండలాల్లో అధికంగా సాగయ్యే వరి పంట చేతికందే సమయంలో పూర్తిగా నేలపాలవడం, నూర్పిడిలో ఉన్న ధాన్యం తడిసిపోవడంతో మొత్తం 2 లక్షల క్వింటాళ్ల మేరకు ధాన్యం దెబ్బతింది. పలు మండలాల్లోని 10 వేల హెక్టార్ల వరకు టమోటా పంట నీటమునిగి కుళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ శుక్ర, శని, ఆదివారాల్లో కురిసిన వడగండ్ల వర్షంతో ఉన్న కాస్త పంట కూడా చేజారిపోయింది. కురబలకోట, పెద్దతిప్పసముద్రం, వి.కోట, గంగవరం, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో నష్టం ఎక్కువ సంభవించింది. దాదాపు 10 వేల హెక్టార్లకు పైబడి మామిడి పంట నేలపాలయింది. దాదాపు వెయ్యి హెక్టార్లలో కోతకు సిద్ధంగా ఉన్న టమాట పనికిరాకుండా పోయింది. వరి పంట కూడా దాదాపు వెయ్యి ఎకరాల మేరకు దెబ్బతింది. వైఎస్సార్ జిల్లాలో వరుసగా మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు రూ.12.52 కోట్ల పంట నష్టం సంభవించింది. గత నెల 17న వీచిన గాలులు, వాన దెబ్బకు అరటి, బొప్పాయి, మామిడి, ఉల్లి పంటలతోపాటు ఉడికించి ఎండబోసిన 274 హెక్టార్లలోని పసుపు పంట నీటిపాలైంది. రూ.80 లక్షల నష్టం వాటిల్లింది. అలాగే, 30, 31 తేదీల్లో ఈదురుగాలులు, వాన బీభత్సానికి అరటి, బొప్పాయి, మామిడి, టమాటా, దోస పంటలు 824.5 హెక్టార్లలో దెబ్బతినగా రూ.11.72 కోట్ల దిగుబడులు రైతులు నష్టపోయారు. అనంతపురం జిల్లాలోనూ పండ్ల తోటలకు రూ.70 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. రాప్తాడు, యాడికి, ఎన్పీ కుంట, తలుపుల, పుట్లూరు, ఓడీ చెరువు, నార్పల, యల్లనూరు తదితర మండలాల పరిధిలో అరటి, టమాట, మామిడి తోటలు 80 నుంచి 90 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. రైతులకు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇదిలా ఉంటే.. మండు వేసవిలో ఉక్కపొతతో అల్లడుతున్న విజయవాడ వాసులు అదివారం రాత్రి కురిసిన తేలికపాటి వర్షంతో సేద తీరారు. సెలవు రోజు కావడంతో కుటుంబంతో బయటకు వచ్చిన వారు కొంత ఇబ్బందిపడ్డారు. పలుచోట్ల చెట్లు విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరాఫరాకు అంతరాయం కలిగింది. హైదరాబాద్‌ను కుదిపేసిన వాన సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. దీంతో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సుమారు అర్ధగంటకు పైగా వర్షం కురవడంతో పలుచోట్ల రోడ్డుపై నీరు నిలిచింది. అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షంతో నగరవాసులకు ఎండ నుంచి ఒక్కసారిగా ఉపశమనం కలిగింది. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఆదివారం కూడా కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రబీ పంటలను ఊడ్చిపెట్టేసింది. చేతికందే దశలో ఉన్న కష్టార్జితం తుడిచిపెట్టుకుపోయింది. ఎక్కడ చూసినా నేలరాలిన వడ్ల గింజలు, మామిడి కాయలు.. ఇతర పంటలు రైతుకు కన్నీటినే మిగిల్చాయి. నేడూ రాష్ట్రంలో వర్షాలు సాక్షి, విశాఖపట్నం/అమరావతి : ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, దీని నుంచి కొమరిన్ వరకు విదర్భ, కర్ణాటక, తమిళనాడుల మీదుగా అల్పపీడన ద్రోణి విస్తరించి ఉన్నాయని.. వీటి ఫలితంగా సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. అనంతరం రానున్న మూడు రోజులూ రాష్ట్రంలో అక్కడక్కడ జల్లులుగాని, తేలికపాటి వర్షంగాని కురవవచ్చని పేర్కొంది. ద్రోణి, ఆవర్తనాల ప్రభావం వల్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని, దీంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
అండమాన్‌లో భూకంపం: తీవ్రత 5.2 గా నమోదు
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2 గా నమోదు అయిందని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. అండమాన్‌కు 38 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. అయితే ఎక్కడ ఎలాంటి ఆస్తి నష్టం... ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని వాతావరణ శాఖ పేర్కొంది.